హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఖండించారు. వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీజేపీ కార్పొరేటర్లు వీధి రౌడీలు, గుండాల్లా వ్యవహరించారు. అయినా ఈ గాడ్సే భక్తులు గాంధీ మార్గాన్ని అనుసరిస్తారని ఎలా అనుకుంటాం? బీజేపీ కార్పొరేటర్ల ఈ దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి విజ్ఞప్తి చేస్తున్నాం’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.