గచ్చిబౌలిలో పురాతన కాలం నాటి మెట్ల బావిని పునరుద్ధరించారు. అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ బుధవారం ఈ బావిని ప్రారంభించారు. మెట్ల బావి పునరుద్ధణకు కృషి చేసిన వారికి అభినందనలు తెలుపుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
రెయిన్ వాటర్ ప్రాజెక్టు వ్యవస్థాపకురాలు కల్పనా రమేష్ నేతృత్వంలో ఈ బావి పునరుద్ధరణ చేపట్టగా… చిరాగ్ స్కూల్ యజమాన్యం సహాయం అందించింది. మెట్ల బావి పునరుద్ధరణకు ముందుగా దాంట్లోని సున్నం గాఢతను పరీక్షించి, అనంతరం రెడీ మిక్స్‌లో సున్నాన్ని కలిపి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ బావి పునరుద్ధరణకు కృషి చేసిన చిరెక్ స్కూల్ యాజమాన్యంపై, ది రెయిన్‌వాటర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు కల్పనా రమేశ్‌పై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపిస్తూ… కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా మరిన్ని స్కూల్స్ ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలన్నారు.