mt_logo

కేసీఆర్ వచ్చాకే ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీళ్లు వచ్చాయి : జల సాధన సమితి నాయకుడు దుశ్చర్ల సత్యనారాయణ

‘నీళ్లు వస్తే ఇంటి ముందట కూలోడు దొరకడు. జీతగాడు దొరకడు’ అని నల్లగొండ ప్రజలకు నీళ్లు రాకుండా చేశారు ఉమ్మడి పాలకులు అని జల సాధన సమితి నాయకుడు, నల్లగొండ ఫ్లోరోసిస్ ఉద్యమాన్ని నడిపిన నాయకుడు దుశ్చర్ల సత్యనారాయణ అన్నారు. ఒక్క కేసీఆర్‌ మాత్రమే పోరుయాత్రతో ఫ్లోరైడ్‌ బాధితులకు బాసటగా నిలిచి, గల్లీ నుంచి ఢిల్లీదాకా పోరాటం చేసి మాకు అండగా నిలిచారని అన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత మొట్టమొదట ఫ్లోరైడ్‌ ప్రభావిత మునుగోడు నియోజకవర్గం నుంచే మిషన్‌ భగీరథ అనే మహత్తర పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని, ఇప్పుడు ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీళ్లు అందిస్తున్నారని కొనియాడారు. దేనికోసమైతే నాలుగు దశాబ్దాల పాటు ఉద్యమించామో అది నేడు సాకారమవుతున్నదని దుశర్ల సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు.

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన… ‘సమైక్య రాష్ట్రంలో అప్పుడున్న ఇంజినీర్లు నల్లగొండ జిల్లాకు చుక్క నీళ్లు రావన్నరు. కృష్ణానది నీళ్లు నల్లగొండ జిల్లాకు రావటం మిథ్య అన్నరు. 1992లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి..‘నేను బతికుండగా మీకు నీళ్లు రావు.. కాల్వలు రావు’ అన్నడు. కానీ, సీఎం కేసీఆర్‌ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే సాధించి.. నల్లగొండలో లక్షల ఎకరాలకు సాగు నీళ్లు పారించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థికి ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాభివృద్ధిపై సంపూర్ణ అవగాహన ఉన్న టీఆర్‌ఎస్‌కే మద్దతివ్వాలని దుశ్చర్ల మునుగోడు ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *