mt_logo

నిరుపేద ఫెన్సింగ్ క్రీడాకారిణికి ఆర్థిక సహాయం అందించిన మంత్రి కేటీఆర్

నిరుపేద ఫెన్సింగ్ క్రీడాకారిణికి తానున్నాని అండగా నిలిచారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. 50 వేల రూపాయలతో పాటు, స్పోర్ట్స్ కిట్ ను అందజేసి, భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే… నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం, చండూర్ మండలం, బంగారి గడ్డ గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ హుస్సేన్ తన ఇద్దరు కూతుర్లు, కొడుకును చదువుతోపాటు, క్రీడల్లో ప్రోత్సస్తున్నాడు. వారి ముగ్గురూ హాకింపేట స్పోర్ట్స్ స్కూల్లో చదువుతూ జాతీయ, అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడలో రాణిస్తున్నారు. కాగా హుస్సేన్ పెద్ద కుమార్తె నజియా ఇటీవల లండన్ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ ఛాంపియన్షిప్ లో ఫెన్సింగ్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పథకాన్ని సైతం గెలుచుకొంది. ఈ క్రమంలో మరింత శిక్షణ అవసరం కాగా కుటుంబ ఆర్థిక ఇబ్బందులు అడ్డుకున్నాయి. దీంతో సహాయం చేయాలని నజియా మంత్రి కేటీఆర్ ను సామజిక మాధ్యమం ద్వారా కోరగా… స్పందించిన కేటీఆర్ తప్పకుండా సహాయం అందిస్తానని మాటిచ్చారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి గారు, ఫెన్సింగ్ ప్రెసిడెంట్ మర్రి రాజశేఖర రెడ్డి, బంగారిగడ్డ గ్రామ ఇంచార్జి ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బంగారి గడ్డ గ్రామం సర్పంచ్ వెంకటేష్ గౌడ్ తో కలిసి క్రీడాకారిణి నజియా ఇంటికి వెళ్లి స్పోర్ట్స్ కిట్ ను, అలాగే 50,000 రూపాయల రూపాయల చెక్ ను అందజేశారు. అంతర్జాతీయంగా మెడల్స్ సాధిస్తున్న నజియాను మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *