mt_logo

అగ్రోస్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

అగ్రోస్ ఆధ్వర్యంలో మేనేజ్ శిక్షణా సంస్థ 30 మంది అభ్యర్థులకు 45 రోజుల పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు శిక్షణనివ్వగా.. నాబార్డు, మేనేజ్ సంస్థల సహకారంతో ఎస్బీఐ బ్యాంకు నుండి అభ్యర్థులు ఒక్కొక్కరికి రూ.10 లక్షల సబ్సిడీ రుణంతో పాటు శిక్షణా దృవపత్రాలను శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందజేసి, వారిని అభినందించారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ రంగంలో అయినా కష్టపడితేనే గుర్తింపు లభిస్తుందని, ప్రతీ విజయం వెనుక ఎంతో కష్టం ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గతానికి, ఇప్పటికి ప్రజల అవసరాలు మారిపోయాయని, పట్టణీకరణతో నగర జీవితంలో ఒత్తిళ్లు ఉన్న క్రమంలో గ్రామీణ జీవనం విస్తరిస్తేనే ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. అగ్రోస్ శిక్షణను సద్వినియోగం చేసుకుని, గ్రామాలలో ప్రజల అవసరాలను గుర్తించి వ్యాపారాలను ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇచ్చారు. నాణ్యమైన సేవలు, నాణ్యమైన వస్తువులు ప్రజలకు అందిస్తామనే నమ్మకం కలిగించి, వివిధ అవసరాల మీద మీ వద్దకు వచ్చే రైతులు, వినియోగదారులతో స్నేహ పూర్వకంగా మెలగాలని అభ్యర్థులకు మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు అగ్రోస్ ఎం.డి. రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *