ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ కొద్దిసేపటి క్రితం లక్నో చేరుకున్నారు. అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో మంత్రి సమావేశం అయ్యారు. వాటర్ గ్రిడ్ పథకంకు సంబంధించిన అన్ని అంశాలను యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ కు కేటీఆర్ ఈ సందర్భంగా వివరించనున్నారు. మంత్రి కేటీఆర్ వెంట పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమాండ్ పీటర్, సురేందర్ రెడ్డి తదితరులు వెళ్ళారు.