తెలంగాణ రాష్ట్రంలో వాహనాల నెంబర్ ప్లేట్ల మార్పుకు రంగం సిద్ధమైంది. వాహనాల నెంబర్ ప్లేట్లపై ఏపీకి బదులు టీఎస్ గా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. నెంబర్ ప్లేట్లు మార్చుకోవడానికి నాలుగు నెలల గడువు విధించింది. జిల్లాల కోడ్ లు కూడా ఏర్పాటు చేసుకోవాలని అన్ని జిల్లాల ఆర్టీఏ కార్యాలయాలను ప్రభుత్వం ఆదేశించింది.