mt_logo

జర్నలిస్టు కుటుంబాలను ఆదుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే : అల్లం నారాయణ

కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలిచి ఆర్థిక భరోసా కల్పించిన ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమేనని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ పేర్కొన్నారు. బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని మీడియా అకాడమీ కార్యాలయంలో విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ముందు చూపు, ప్రత్యేక చొరవతోనే జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటైందని, ఈ నిధికి రూ.42 కోట్లు విడుదల చేశారని తెలిపారు. కరోనాతో మరణించిన 65 మంది జర్నలిస్టుల కుటుంబాలకు 2 లక్షలు, సాధారణంగా మరణించిన 40 మంది జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష, ప్రమాదాల బారిన పడిన జర్నలిస్టులకు రూ.50 వేల చొప్పున తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంక్షేమనిధి నుంచి మొత్తం రూ.1.74 కోట్ల చెక్కులు పంపిణీ చేశామని తెలిపిన నారాయణ… ఇప్పటివరకు దాదాపు 353 మంది జర్నలిస్టు కుటుంబాలకు సుమారు 5.70 కోట్ల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసి వందల మందికి సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. తన ఎదుగుదలలో జర్నలిస్టు మిత్రుల సహకారం ఎంతో ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర్‌రావు, సమాచారశాఖ జేడీ జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *