mt_logo

హైదరాబాద్ లో ఎల్‌టీఐ కొత్త కార్యాలయం

టెక్నాలజీ కన్సల్టింగ్‌ అండ్‌ డిజిటల్‌ సొల్యూషన్స్‌ కంపెనీ, మధ్య శ్రేణి ఐటీ సేవల సంస్థ లార్సెన్‌ అండ్‌ టూబ్రో ఇన్ఫోటెక్‌ (ఎల్‌టీఐ).. హైదరాబాద్‌లో కొత్త డెలివరీ సెంటర్‌ను ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ మంగళవారం ప్రారంభించింది. కంపెనీ అంతర్జాతీయ కార్యకలాపాలకు మద్దతుగా ఇక్కడి నుంచి 3వేలకు పైగా ఉద్యోగులు పనిచేయనున్నారు.

డిజిటల్‌, డాటా, క్లౌడ్‌ :

1,10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్టేట్‌-ఆఫ్‌-ది-ఆర్ట్‌ సెంటర్‌ను ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ ఏర్పాటు చేసింది. విదేశీ కస్టమర్లకు డిజిటల్‌, డాటా, క్లౌడ్‌ సొల్యూషన్స్‌ అందించడంపై ఈ సెంటర్‌ ప్రధానంగా దృష్టి పెట్టనున్నది. ‘గ్లోబల్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌ నగరం ఎంతో ప్రత్యేకం. ఇక్కడ నైపుణ్యానికి కొదవే లేదు. ప్రభుత్వం కూడా కార్పొరేట్‌ సంస్థలను ఎంతగానో ప్రోత్సహిస్తుంది. ఈ కొత్త సెంటర్‌తో మా కార్యకలాపాలు మరింతగా బలోపేతం అయ్యి, ఇంకా వృద్ధి చెందుతాయి’ అని ఎల్‌టీఐ సీవోవో నచికేత్‌ దేశ్‌పాండే ఈ సందర్భంగా అన్నారు.

ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌కు శుభాకాంక్షలు : మంత్రి కేటీఆర్

‘ప్రతిభ, టెక్నాలజీ సొల్యూషన్‌ ప్రొవైడర్ల కోసం నేడు తెలంగాణే అందరి ఎంపిక. ఇది మా కృషికి ఫలితం. రాష్ట్రంలో వ్యాపార నిర్వహణ ఎంతో సులభతరమైంది. ఎల్‌టీఐ వంటి గ్లోబల్‌ సంస్థల రాక పెరగడమే ఇందుకు నిదర్శనం. కొత్త సెంటర్‌ను ప్రారంభించిన ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌కు నా శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో మైలురాళ్లను సంస్థ అధిగమించాలని కోరుకుంటున్నాను’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *