mt_logo

టీఆర్ఎస్ తన కంచుకోటలో హ్యాట్రిక్ కొట్టబోతోందా..?

హుజురాబాద్ మొదటి నుంచీ టీఆర్ఎస్ పార్టీ కంచుకోట. ఉద్యమ ప్రస్థానంలో ఈటెల రాజేందర్ రాక ముందునుంచే టీఆర్ఎస్ కు ఇక్కడ విజయాలు అలవాటు. ముఖ్యంగా ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీర్ఎస్ ఇక్కడ విజయ ఢంకా మోగించేది. రెండు సార్లు జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీదే విజయం. అందుకే ఇప్పుడు హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్నారు టీఆర్ఎస్ శ్రేణులు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2004లో ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఆ ఎన్నికల్లో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి కెప్టెన్ లక్ష్మీకాంతారావు విజయం సాధించారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ స్థానం నుండి ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 13 శాతం ఎడ్జ్ ఉన్నట్లు కేసీఆర్ చేయించిన సర్వేల్లో వెల్లడైంది. కనీసంగా 5 వేల ఓట్ల మెజారిటీ గెల్లుకు దక్కొచ్చన్నది మరో సర్వేలో తేలింది. ఇవన్నీ నిర్ధారించుకున్నాకే కేసీఆర్ రంగంలోకి దిగారు. భారీ మెజారిటీపై కన్నేశారు. తన ప్రత్యర్థి ఈటెలకు రాజకీయ సన్యాసం ఇప్పించాల్సిందే అన్నంతగా ఆయన ఈ ఉప ఎన్నికల కోసం పని చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పథకాల ద్వారా దాదాపు 250 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఇక తన తురుపు ముక్క దళిత బంధు ఉండనే ఉంది. అది బీజేపీ ఆపిందనే ప్రచారం జరగడంతో ఇక దళితుల ఓట్లన్నీ గంప గుత్తగా టీఆర్ఎస్ కే పడే అవకాశం ఉంది. బీసీలు రెండు గా చీలినా… రెడ్లు, మైనారిటీలు,ఇతర కులాల వారు టీఆర్ఎస్ తో నడిచే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి టీఆర్ఎస్ తన కంచుకోటలో ఉప ఎన్నికల హ్యాట్రిక్ కొట్టడానికి పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నట్లే. 27న 10 లక్షల మందితో తలపెట్టిన కేసీఆర్ విజయభేరి సభ విజయవంతం అయితే ఇక గెల్లు గెలుపుకు తిరుగుండదు అనేది టీఆర్ఎస్ శ్రేణుల అంచనా..గతంలో జరిగిన రెండు ఉప ఎన్నికలు తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగాయి.. ఇది మాత్రం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నిక కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *