mt_logo

యాసంగిలో 33 లక్షల ఎకరాలకు సాగునీరు 

రానున్న యాసంగిలో రాష్ట్రంలో 23 భారీ ప్రాజెక్టులు, 35 మధ్యతరహా ప్రాజెక్టుల కింద 32.8 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ (స్కైవమ్‌) నిర్ణయించింది. ఈఎన్సీ (జనరల్‌) మురళీధర్‌ నేతృత్వంలోని కమిటీ మంగళవారం జలసౌధలో సమావేశమైంది. ఏ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలకు నీటిని విడుదల చేయాలో నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిండుగా ఉండటంతో.. భారీ ప్రాజెక్టుల ద్వారా సుమారు 29 లక్షల ఎకరాలు, మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని భావిస్తున్నారు. సాగు, తాగునీటి అవసరాల కోసం 342 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ప్రణాళిక రచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *