mt_logo

ఆవిష్కరణలకు అడ్డాగా తెలంగాణ.. వరల్డ్ టాప్-30 లో హైదరాబాద్

రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం స్టార్టప్‌ లకు అనుకూల వాతావరణం (ఎకోసిస్టమ్‌) కలిగి ఉండటం జాతీయంగానే గాక అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు విభిన్న కేటగిరిల్లో హైదరాబాద్ టాప్‌-30లో నిలిచింది. స్టార్టప్‌ జినోమ్‌, గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ నెట్‌వర్క్‌లు కలిసి గ్లోబల్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ రిపోర్టు (జీఎస్‌ఈఆర్‌)-2021ను బుధవారం విడుదల చేశాయి. ఇందులో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌ రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అతిపెద్ద నివేదికగా చెప్పుకునే జీఎస్‌ఈఆర్‌-2021లో తెలంగాణకు స్థానం దక్కడం తమకు గర్వకారణంగా ఉందని టీ-హబ్‌ సీఈవో రవి నారాయణ్‌ అన్నారు. ఇందులో ప్రధానంగా టీ-హబ్‌తోపాటు టీఎస్‌ఐసీ, వీ-హబ్‌, టాస్క్‌, రిచ్‌, టీ-వర్క్స్‌, తెలంగాణ ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌ భాగస్వాములు కీలకంగా ఉన్నారని తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా 280కిపైగా ఎకోసిస్టంలను మూల్యంకనం చేసిన స్టార్టప్‌ జినోమ్‌.. 140 ప్రధాన ఎకోసిస్టంలకు ర్యాంకులనిచ్చింది.

స్టార్టప్‌ లకు ప్రత్యేక వెబ్‌సైట్‌:

‘స్టార్టప్‌ తెలంగాణ పోర్టల్‌’ను మరింతగా విస్తరించేందుకు రాష్ట్ర స్థాయిలో స్టార్టప్‌లకు ప్రత్యేకంగా గుర్తింపు వచ్చేలా చేసేందుకు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. చక్కని ఆలోచన, దాన్ని ఆచరణలో పెట్టే సాంకేతిక నైపుణ్యం ఉంటే చాలు పెట్టుబడులతో సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వివిధ రంగాలకు చెందిన పెట్టుబడిదారుల నుంచి మద్దతు కూడగట్టేందుకు వేదికగా ఈ వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దారు.

రిపోర్టులో తెలంగాణ రికార్డులు ఇవే:

*మెరుగైన నైపుణ్యంలో టాప్‌-15
*ఫండింగ్‌లో టాప్‌-20
*విజ్ఞానం, ఆవిష్కరణల్లో టాప్‌-30
*పనితీరులో టాప్‌-30
*ప్రతిభ, అనుభవంలో టాప్‌-30

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *