mt_logo

రాష్ట్రంలో అతిపెద్ద వైద్య పరికరాల పార్క్ ఏర్పాటు : కేటీఆర్

కంటి చికిత్స పరికరాల తయారీకి ముందుకొస్తే సుల్తాన్‌పూర్‌లోని మెడికల్‌ డివైసెస్ పార్క్‌లో ప్రత్యేక క్లస్టర్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ప్రపంచ స్థాయి వైద్య సంస్థలు హైదరాబాద్‌లో ఉండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పూర్‌లో ఎల్వీ ప్రసాద్‌ ఐ టెక్నాలజీ అండ్‌ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను కేటీఆర్‌ ప్రారంభిన కేటీఆర్.. నా దేశానికి ఎంతో కొంత సేవ చేయాల‌నే ఉద్దేశంతో అమెరికాలో ఉద్యోగం వ‌దిలేసి వచ్చానని, తాను ఉద్యోగం వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు ఇండియా ఇప్పుడు ఉన్న‌ట్లుగా లేద‌ని, ప్రస్తుతం విదేశీ పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేలా దేశంలో చాలా మార్పులు వ‌చ్చాయ‌న్నారు. ఇప్పటికీ 80 శాతం వైద్య పరికరాలు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని, ఇలా ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశంలోనే వైద్య పరికరాల ఉత్పత్తి జరగాలని ఆకాంక్షించారు. సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్రంలోనే అతిపెద్ద వైద్య పరికరాల తయారీ పార్క్‌లో ఇప్పటికే 28 సంస్థలు కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చాయని కేటీఆర్‌ తెలిపారు. మూడేళ్ల క్రితం కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అందరికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. కంటి చికిత్స పరికరాల తయారీకి ముందుకొస్తే క్లస్టర్‌ ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *