mt_logo

స్థానిక భాషలు మాట్లాడే సిబ్బందిని నియంమించండి : ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు మంత్రి కేటీఆర్ సూచన

స్థానిక భాషలు మాట్లాడే సిబ్బందిని కూడా నియమించుకోవాలని ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రాంతీయ రాష్ట్రాల్లో ప్రయాణించే విమానాల్లో ఇంగ్లిష్‌, హిందీ రానివారి సౌకర్యార్థం తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషలు మాట్లాడేవారిని నియమించాలని ఆదివారం మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో కోరారు. ఈనెల 16న ఓ మహిళా ప్రయాణికురాలు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో వస్తుండగా, ఆమెకు కేటాయించిన సీటు నుంచి బలవంతంగా వేరే సీటులోకి మార్చారు. భద్రతా కారణాల వల్లనే మార్చాల్సి వచ్చిందని ఎయిర్‌హోస్ట్‌ చెప్పారు. అయితే వాస్తవానికి ప్రయాణికురాలికి తెలుగు తప్ప వేరే భాష రాదు. అందుకే ఆమెను వేరే సీటులో కూర్చొబెట్టినట్లు ఓ ప్రయాణికుడి ట్వీట్‌పై కేటీఆర్‌ ఈ మేరకు స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *