mt_logo

మంత్రి కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరిన దుబాయ్ బాధితులు

దుబాయ్ లో చిక్కుకున్న నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఆరుగురు యువకులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సహాయంతో క్షేమంగా స్వస్థలాలకు చేరుకున్నారు. కాగా పదిహేను రోజుల క్రితం… తాము దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్నామని, తమని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని నిజామాబాద్ కి చెందిన యువకులు సోషల్ మీడియా ద్వారా మంత్రి కేటీఆర్ ను వేడుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్… ప్రత్యేక చొరవ చూపి దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌ అధికారులతో మాట్లాడి.. తన సొంత ఖర్చుతో ఆ యువకులు స్వదేశానికి వచ్చే ఏర్పాట్లు చేశారు. ఫలితంగా వీరంతా గురువారం అర్ధరాత్రి క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆ యువకులను..టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి పంపించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *