mt_logo

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల ఆడియో లీక్ ఎఫెక్ట్… మునుగోడులో జేపీ నడ్డా బహిరంగ సభ రద్దు

తెలంగాణ అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి, పార్టీ ఫిరాయింపులకు ప్రయత్నించిన బీజేపీ నేతల అనుచరుల ఆడియోలు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. ఫరీదాబాద్ కు చెందిన స్వామిజీ రామచంద్రభారతి టీఆర్ఎస్ పైలట్ రోహిత్ రెడ్డితో పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన సంభాషణ విడుదల కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. పైలట్ రోహిత్ రెడ్డితో మాట్లాడుతున్న స్వామీజీ… తాను హైదరాబాద్ వస్తానని, అక్కడ అన్ని సెటిల్ చేసుకుందాం అనడం ఆడియోలో ఉండగా…  మరో ప్రధాన నిందుతుడు నందకుమార్, బీజేపీ జనరల్ సెక్రెటరీ బిఎల్ సంతోష్ తోపాటు పలువురు బీజేపీ కీలక నేతల పేర్లు పలుమార్లు ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ ఆడియో ప్రధాన మీడియాతోపాటు జాతీయ మీడియాలో, సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ఈ ఫిరాయింపు యత్నాలకు సంబంధించి మరిన్ని ఆడియో, వీడియోలు బయటకు రానున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఇదిలా ఉండగా… అక్టోబర్ 31న బీజేపీ తలపెట్టిన బహిరంగ సభ రద్దయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవనున్న ఈ బహిరంగ సభను హుటాహుటిన రద్దు చేసుకోవడానికి ముఖ్య కారణం… టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల యత్నానికి సంబంధించిన ఆడియోలే అని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *