తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్‌కు రేపటితో గడువు ముగియనుంది. దీంతో అభ్యర్థుల నుండి దరఖాస్తులు భారీగా వెల్లువెత్తుతున్నాయి. పెద్ద సంఖ్యలో పోస్టులు ఉండటం, అప్లికేషన్ చివరి తేదీ పొడిగించడంతో అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. మే 31న దరఖాస్తుకు గడువు ముగిసిపోగా, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 4కు పొడిగించారు. కాగా ఇప్పటివరకు 3,58,237 గ్రూప్–1 దరఖాస్తులు నమోదయ్యాయి. కొత్తగా 1,88,137 మంది అభ్యర్థులు ఓటీఆర్ అప్డేట్ చేసుకొన్నారు. దీంతో ఓటీఆర్ ఎడిట్ చేసుకొన్న వారి సంఖ్య 3,79,851కి చేరింది. దరఖాస్తు నమోదులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా టీఎస్పీఎస్సీ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది.

