mt_logo

ట్రయల్స్ కు సిద్ధమవుతోన్న ఫార్ములా ఈ – రేస్ ఈవెంట్

దేశంలో తొలిసారిగా హైదరాబాద్ వేదికగా జరగనున్న ఫార్ములా ఈ – కార్ రేస్ ఈవెంట్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే ట్రాక్ నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. అలాగే నవంబర్ 19, 20 తేదీల్లో మొదటి ట్రయల్ నిర్వహణకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ గార్డెన్ చుట్టూ 2.7 కిమీ ట్రాక్‌ను ఎఫ్‌ఐఏ అనుమతులతో ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 600మీటర్ల మేర ఎన్టీఆర్‌ గార్డెన్‌లో నుంచి కొత్తగా రోడ్డు వేస్తున్నామని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) ఎండీ సంతోష్‌ తెలిపారు. ట్రాక్‌ నిర్మాణం సందర్భంలో తొలగించిన 214చెట్లను ట్రాన్స్‌లోకేషన్‌ చేసేందుకు అనుమతులు తీసుకున్నామని, ఇప్పటికే 206చెట్లను ట్రాన్స్‌లోకేషన్‌ చేశామని తెలిపారు. దీని నిమిత్తం రూ.1,18లక్షల మేర ఫారెస్టు విభాగానికి ఫీజులు చెల్లించామన్నారు. రేసులో కారు వేగం గరిష్టంగా 320కిలోమీటర్ల మేర ఉంటుందని, అందుకనుగుణంగా రోడ్డును డిజైన్‌ చేస్తున్నామని తెలిపారు. 

దేశీయ, అంతర్జాతీయ డ్రైవర్ల విన్యాసాలు, రేస్‌ కార్ల పరుగులు వీక్షించడానికి రేసింగ్‌ ప్రియులు సిద్ధమయ్యారు. ఈ పోటీలలో 6 టీమ్‌లు పాల్గొంటుండగా, 2.7 కిలోమీటర్ల పొడవున ట్రయల్‌ రేసింగ్‌ సాగనుంది. ప్రతీ టీంలో నలుగురు సభ్యులుండగా అందులో ఇద్దరు అంతర్జాతీయ డ్రైవర్స్‌ ఉంటారు. కాగా మరో ట్రయల్న్‌ డిసెంబర్‌ 10, 11న నిర్వహించనున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరిగే ఈ-ఫిక్స్‌ కార్‌ రేసు కోసం నాలుగు రోజుల పాటు ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిపివేస్తామని వివరించారు. 30వేల మంది వీక్షించేందుకు గ్యాలరీలను ఏర్పాటు చేస్తామని అన్నారు.

కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ-ఫ్రిక్స్‌ కారు రేసు నేపథ్యంలో ఈనెల 19, 20 తేదీల్లో నిర్వహించే ట్రయల్స్‌ వీక్షించేందుకు టికెట్లను బుక్‌ మై షోలో నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. రెగ్యులర్‌ పాస్‌ రూ.749. కాగా ఇదీ ఒకే రోజుకు నిర్ణీత సమయానికి వినియోగించే అవకాశముంటుంది. వీకెండ్‌ పాస్‌ ధర రూ.1249 నుంచి 11,999 వరకు నిర్ణయించారు. ఇందులో ఐదు స్టాండ్‌ల టికెట్లు ఉన్నాయి. వీటి ధర రూ.1,999 ఉండగా, పడ్డక్‌ గోల్డ్‌ రూ.8499, పడ్డక్‌ ప్లాటినం ధర రూ.11,999గా ఉంది. ఈ టికెట్లు రెండు రోజులపాటు చెల్లుబాటవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *