నిజాం కాలేజీకి అనుబంధంగా నిర్మించిన కొత్త హాస్టల్ లో సీట్ల కేటాయింపు వివాదాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిష్కరించారు. ముందుగా ఈ హాస్టల్ లో సీట్లను పీజీ విద్యార్థులకు కేటాయించారు. ఐతే యూజీ స్టూడెంట్స్ తమకే కేటాయించాలని ఆందోళనకు దిగారు. దీంతో ఈ అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించి…సమస్య ను పరిష్కరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. దీంతో ఓయూ వీసీ రవీందర్ యాదవ్, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్‌తో మాట్లాడి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యను పరిష్కరించారు. ఈ మేరకు కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనంలో 50 శాతం సీట్లను యూజీ విద్యార్థినులకు, మరో 50 శాతం సీట్లను పీజీ విద్యార్థినులకు కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
