పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులుచెరిగారు. పవన్ పెట్టిన జనసేన పార్టీ ఎన్నికల ముందు మేకప్ వేసుకొని తర్వాత పేకప్ చెప్పే పార్టీ అని విమర్శించారు. ప్రజాపార్టీల ఆవిర్భావం ఫైవ్ స్టార్ హోటళ్ళలోనా? అని ప్రశ్నించారు. గద్దర్ అంటే ఇష్టమన్న పవన్ కళ్యాణ్ గద్దర్ పై బుల్లెట్లు పేల్చిన చంద్రబాబును ఇష్టపడటం వింతగా ఉందని అన్నారు.