తెలంగాణ పోలీస్ శాఖ ‘ఫిక్కీ’ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ అండ్ ఇండస్ట్రీ) అవార్డుకు ఎంపికయింది. స్మార్ట్ పోలీసింగ్ లో ఉత్తమ విధానాలను అమలు చేస్తున్నందుకుగాను తెలంగాణ పోలీస్ శాఖకు ‘2021–స్మార్ట్ పోలీసింగ్’ అవార్డును ఫిక్కీ ప్రకటించింది. తెలంగాణ పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగంలో షీ-భరోసా, సైబర్ ల్యాబ్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి బాలల రక్షణలో సాధించిన ఉత్తమ ఫలితాలకుగాను న్యూ ఢిల్లీలోని ఫిక్కీ ఈ అవార్డును ప్రకటించింది. ఈ ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు- 2021 ను నేడు న్యూ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా కు ఫిక్కీ ప్రతినిధులు అందచేశారు.