mt_logo

ఈటెల సతీమణికి నిరసనల సెగ, ఖాళీ గ్యాస్ సిలిండర్లతో అడ్డుకున్న స్థానికులు

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ ధరలు బీజేపీ నేతల మెడకు చుట్టుకుంటున్నాయి. పెరుగుతున్న వంట గ్యాస్ ధరలపై ప్రజలు ఎక్కడికక్కడ బీజేపీ నేతలను నిలదీయడంతో వారికి ప్రజల మధ్య తిరగడానికి మొహం చెల్లడం లేదు. తాజాగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ సతీమణి ఈటల జమున హుజూరాబాద్‌ పట్టణంలోని గురువారం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ క్రమంలో కొందరు మహిళలు వంట గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ తమ ఇంటి ఎదుట ఖాళీ సిలిండర్లు ప్రదర్శించారు. పెరిగిన సిలిండర్ల ధరలను తగ్గించి ఓటు అడగాలని కోరినా జమున వారిని పట్టించుకోలేదు. రోజురోజుకూ పెరుగుతున్న గ్యాస్‌ ధరలతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని నిరసన వ్యక్తం చేసినా జమున వినీ విననట్టుగా, వారిని ఓటు అడగకుండానే దాటవేసి వెళ్లిపోయారని పలువురు మహిళలు తెలిపారు. ఓట్లు వేయకముందే ప్రజల సమస్యలు వినకపోతే రేపు ఎలక్షన్ అయ్యాక మమ్మల్ని అసలు పట్టించుకుంటారా జమున గారూ అంటూ పలువురు మహిళలు, స్థానికులు ప్రశ్నించారు. ప్రజలనుండి నిరసన వెల్లువెత్తడంతో ఓట్లు అడగకుండానే, ప్రచారం ఆపేసి ఈటెల జమున అక్కడి నుండి వెనుదిరిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *