సిద్దిపేటలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు వ్యతిరేకంగా దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. దుబ్బాకలో రఘునందనరావు దిష్టి బొమ్మను దళిత సంఘాలు దహనం చేశాయి. ఢిల్లీలో కొత్తగా నిర్మించే పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి రఘునందన్ రావు మద్దతు ఇవ్వనందున, నేడు దుబ్బాక నియోజకవర్గం రఘునందన్ డౌన్ డౌన్ నినాదాలతో దద్దరిల్లింది. పలుచోట్ల రహదారులపై నిరసన చేపట్టి రఘునందన్ రావు దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. రావు వైఖరితో బిజెపి నిజస్వరూపం బయటపడింది. దుబ్బాక నియోజకవర్గంలో డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తింది. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలనే టిఆర్‌ఎస్ ప్రభుత్వం తీర్మానానికి వెంటనే అంగీకారం తెలపాలని పలు దళిత సంఘాలు డిమాండ్ చేశాయి.