వట్టికోట ఆళ్వారు స్వామి జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన సేవలను కొనియాడారు. పాత్రికేయుడుగా, కథకుడుగా, నవలా కారుడుగా, తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన వట్టికోట సాహిత్య కృషి అజరామరం అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణా తొలితరం నవలా సాహిత్యకారుడైన వట్టికోట ఆళ్వారుస్వామి స్పూర్తి రాష్ట్రసాధన కోసం సాగిన సాహిత్య సాంస్కృతిక ఉద్యమంలో కీలక భూమికను పోషించిందని సీఎం పేర్కొన్నారు.

