హైదరాబాద్ లో నేడు జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేదికపై సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశ అభ్యున్నతి కోసం కృషి చేసే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో దేశంలో విపరీతమైన జాఢ్యాలు, అనారోగ్యకరమైన, అవసరం లేనుటవుంటి పెడ ధోరణులు ప్రబలుతున్నాయని, భారత సమాజానికి ఇది శ్రేయస్కరం కాదన్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదరించాలని, అద్భుతమైన ఈ దేశంలో దుర్మార్గమైన విధానాలు దేశ ఉనికినే ప్రశ్నించే స్థాయికి పోతున్నాయన్నారు. ఈ సందర్భంంలో ఒక రాజకీయ పార్టీగా దేశానికి మంచి చేయాలనే ఆలోచన ధోరణి ఉండాలన్నారు. ఈ దేశ అభ్యున్నతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కరెంట్ కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ పొరుగున ఉన్న రాష్ట్రాల్లో కూడా కరెంట్ కోతలున్నాయి. చుట్టూ అంధకారమే ఉన్నప్పటికీ.. మణిద్వీపంలా తెలంగాణ వెలుగుతున్నది అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇవాళ దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం.. 4,01,035 మెగావాట్ల అందుబాటులో ఉందని సీఎం తెలిపారు. అందుబాటులో ఉన్న వినియోగించలేని పరిస్థితిలో ఈ దేశం ఉంది. 4 లక్షల మెగావాట్ల విద్యుత్ శక్తి ఉన్నప్పటికీ.. 2 లక్షలకు మించి వాడటం లేదు. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా కరెంట్ కోతలు ఉన్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. మన చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో కూడా కరెంట్ కోతలు ఉన్నాయి. చుట్టూ అంధకారం ఉంటే ఒక మణిద్వీపంలా తెలంగాణ వెలుగుతున్నది. ఏడేండ్ల క్రితం మనకు కూడా కరెంట్ కోతలే. కానీ మనం ఆ సమస్యను అధిగమించాం. వెలుగు జిలుగుల తెలంగాణగా తీర్చిదిద్దుకున్నాం. తెలంగాణలా దేశం పని చేసి ఉంటే.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముంబై నుంచి కోల్‌కతా వరకు 24 గంటలకరెంట్ ఉండేది. దేశంలో ఉన్న సీఎంల సమక్షంలో, ప్రధాని అధ్యక్షతన వహించే నీతి ఆయోగ్‌లోనూ ఈ విషయాన్ని కుండబద్ధలు కొట్టి చెప్పాను. కానీ లాభం లేదని కేసీఆర్ పేర్కొన్నారు.