mt_logo

అందుకే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నాను : సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

జాతీయ రాజకీయాల ప్రవేశంపై సీఎం కేసీఆర్ సోమవారం సంచలన ప్రకటన చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా… కులాల,మతాల మధ్య చిచ్చు పెట్టె దుర్మార్గమైన వ్యవహారం జరుగుతోందని అన్నారు. దేశంలో లెక్కలేనన్ని వనరులు, సంపద, యువశక్తి ఉన్నప్పటికీ దేశాన్ని అభివృద్ధి చేయలేక పోతున్నారని దుయ్యబట్టారు. అందుకే దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నానని, బంగారు భారతదేశం తప్పక సాధిస్తానని ప్రకటించారు. దుర్మార్గమైన మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు దేశంలోని ముఖ్య నేతలను కలుస్తున్నానని, అందరినీ కలుపుకు వెళ్తానని అన్నారు. ప్రజలంతా ఆశీర్వదిస్తే ఢిల్లీ వెళ్లి పోరాడి గెలుస్తానని పేర్కొన్నారు. అంతక ముందు సంగారెడ్డి లోని సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా సంగారెడ్డి, నారాయణఖేడ్, అంధోల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని సుమారు 19 మండలాల పరిధిలోని 3.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *