రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చూసి చలించిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు బాధాకరం.. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రైతులను అన్నివిధాలా ఆదుకుంటుందని చెప్పారు. రైతు సమస్యలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని, సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నిత్యం అధికారులతో చర్చిస్తున్నారని అన్నారు.
ఎన్నికల హామీ మేరకు రూ. 17 వేల కోట్ల పంట రుణాలను ప్రభుత్వం విడుదల చేసిందని రామలింగారెడ్డి గుర్తుచేశారు. నకిలీ విత్తనాలు అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకున్నామని, రైతు సమస్యలపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.