mt_logo

మల్లన్న సాగర్ జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ జ‌లాశ‌యంలో అద్భుత దృశ్యం ఆవిష్కృత‌మైంది. మల్లన్నసాగర్‌ జలాశయాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌కు కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం స్విచ్చాన్ చేసి మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌లోకి నీటిని విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు హ‌రీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. అంతకముందు ఏరియ‌ల్ వ్యూ ద్వారా కేసీఆర్ ప్రాజెక్టును ప‌రిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *