గల్వాన్ ఘటనలో మృతి చెందిన జార్ఖండ్ అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందించారు. శుక్రవారం రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో కలిసి ఆ కుటుంబాలను కేసీఆర్ పరామర్శించి, ఒక్కో కుటుంబానికి పది లక్షల ఆర్థిక సహాయం అందించారు. గల్వాన్‌లోయలో మరణించిన వీరజవాను కుందన్‌కుమార్ ఓఝా సతీమణి నమ్రత కుమారి, మరో వీరుడు గణేశ్ హన్సదా మాతృమూర్తి కప్రా హన్సదాలకు పది లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన వారిని కేసీఆర్ ఓదార్చి, అన్ని వేళలా తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. అంతక ముందు జార్ఖండ్ రాజధాని రాంచీలో గిరిజన ఉద్యమకారుడు బిర్సా ముండా విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. బిర్సాముండా గిరిజన జాతికి, ఈ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ తో సమావేశమయ్యి, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులతో పాటు భవిష్యత్ రాజకీయాలపై ప్రధానంగా చర్చిస్తునట్టు సమాచారం. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత తదితరులు పాల్గొన్నారు.
- KTR urges PM Modi to take action on AMRUT tenders scam in Telangana
- Is Congress govt. using Telangana public money for ads in Marathi newspapers?
- Is Congress govt. encouraging belt shops in rural areas to boost liquor sales?
- Revanth government stalls handloom weavers’ Cheyutha scheme
- Some traditional caste-based occupations and nomadic tribes disregarded in caste census
- ప్రభుత్వంలో మంత్రులు దళారులు, మిల్లర్లతో కుమ్మక్కయ్యారు: జగదీశ్ రెడ్డి
- తెలంగాణలో జరిగిన అమృత్ టెండర్ల స్కాంపైన ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలి: ఢిల్లీలో కేటీఆర్
- అమృత్ టెండర్లలో భారీ కుంభకోణం చేసిన రేవంత్: కేంద్ర మంత్రి ఖట్టర్‌కు కేటీఆర్ ఫిర్యాదు
- ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్ల అధికారులు దెబ్బలు తినాల్సి రావడం దురదృష్టకరం: కేటీఆర్
- రేవంత్ చేస్తున్న అసమర్థ పాలనకు ఐఏఎస్‌లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారు: హరీష్ రావు
- కేసీఆర్ మనిషిని మానవత్వంతో చూశారు.. మతపరంగా, ఓట్ల పరంగా చూడలేదు: కేటీఆర్
- పత్తి రైతులు రోడ్లెక్కి లబోదిబోమంటుంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా.. లేనట్లా: హరీష్ రావు
- బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బలహీనవర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచింది: కేటీఆర్
- రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు రోడ్ల మీద ఉన్న వరి కుప్పలే సాక్ష్యం: హరీష్ రావు
- ప్రజలు ఏమి కోల్పోయారో వారికి అర్థమయ్యింది.. వచ్చే ఎన్నికల్లో మనదే అధికారం: కేసీఆర్