mt_logo

సీఎం కేసీఆర్ ‘మహిళా బంధు’గా చరిత్రలో నిలిచిపోతారు : మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి

మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… ‘ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ‘మహిళా బంధు’గా నిర్వహించవల్సిందిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ కార్యక్రమాల్లో భారీ ఎత్తున మహిళలు పాల్గొనాలని కోరారు. సీఎం కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించాక మహిళల అభివృద్ధికి చేపట్టిన కార్య్రమాలు, వాటి ద్వారా వస్తున్న ఫలితాలు లబ్దిదారులు అయిన మహిళలకు చెప్పాలన్నదే ఈ మూడు రోజుల కార్యక్రమాల ఉద్దేశం అని తెలిపారు. మహిళలు ఆకాశంలో సగం ఉన్నా… గత ప్రభుత్వాలలో అవకాశాల్లో అట్టడుగున ఉండేవారని, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక 70 ఏళ్లలో సాధ్యం కానిది సీఎం కేసిఆర్ గారు 7 ఏళ్లలో సుసాధ్యం చేశారు. రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 10.27 లక్షల మంది మహిళలకి లబ్ది చేకూర్చి వారికి, అండగా నిలిచి మేలు చేశారు. కళ్యాణ లక్ష్మి పొందిన కుటుంబాలను కలిసి వారితో కలిసి సెల్ఫీలు దిగాలి. కేసిఆర్ కిట్ దేశంలో ఎక్కడా లేనిది. కేసిఆర్ కిట్ అంటే ప్రసవ సమయంలో ఇచ్చే పెట్టె మాత్రమే కాదు. 6 నెలల గర్భవతి నుంచి 3 నెలల బాలింత వరకు ఆమెకు ఆర్దికంగా అండగా ఉండేందుకు 12 వేల రూపాయలు ఇస్తూ, ఆడపిల్ల పుడితే అదనంగా 1000 రూపాయలతో పాటు కిట్ ఇస్తున్నాం. దీనివల్ల 10 లక్షల మంది మహిళలు లబ్ది పొందారు. ఆరోగ్య లక్ష్మి పథకం మరొక గొప్ప కార్యక్రమం. దీని కింద ప్రతిరోజు 5 లక్షల మంది మహిళలు భోజనం చేస్తున్నారు. వీరితో పాటు 17 లక్షల మంది పిల్లలు కూడా ప్రతి రోజూ భోజనం తింటున్నారు. ఒక గ్లాస్ పాలు…గుడ్డు ఇస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఇది. కోవిడ్ సమయంలో అనేక కార్యక్రమాలు ఆగినా ఈ కార్యక్రమం ఆగవద్దు అని ఇంటింటికీ రేషన్ ద్వారా అందించాం.గతంలో మహిళలకు సరైన గుర్తింపు లేనినుంచి… తెలంగాణలో అన్ని మహిళల పేరు మీద చేస్తున్న ప్రభుత్వం ఇది. మహిళల కోసం అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రికి మహిళల అందరి తరపున కృతజ్ఞతలు. గతంలో ప్రతిపక్షం, అధికార పక్షం అనే తేడా ఉండేది. కానీ సీఎం కేసిఆర్ గారి నాయకత్వంలో అందరికి సమానంగా సంక్షేమ పథకాలు అందాలని ఈ పథకాలన్నీ అమలు చేస్తున్నారు. అమ్మ ఒడి ద్వారా గర్భిణికి ప్రసవ సమయంలో తల్లి దగ్గర ఉంటే ఎంత ధైర్యం ఉంటుందో..నేడు ప్రభుత్వం ఆ ధైర్యం ఇస్తుంది. ప్రభుత్వ దవాఖనాలలో 32 శాతం ఉన్న ప్రసవాలు 52 శాతానికి పెంచి, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్న ప్రభుత్వం ఇది. అంగన్వాడిలు గర్భిణీల ప్రసవ తేదీలు గుర్తుంచుకుని వారి యోగ క్షేమాలు చూడాలని సీఎం కేసిఆర్ గారు ఆదేశించారు. ఇవన్నీ పథకాల ద్వారా మాతా శిశు మరణాలు రాష్ట్రంలో గణనీయంగా తగ్గాయి. నవ జాత శిశువుల ఐసియూలను 18 నుంచి 65 కు పెంచుకున్నాం. 300 అమ్మ ఒడి వాహనాలు ద్వారా వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జన్మదినం రోజున మహిళల కోసం అమ్మ ఒడి వాహనాలు గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఇవ్వాలని ఆలోచించి, మహిళల క్షేమం కోసం పని చేస్తున్న పార్టీ ఇది. కాబట్టి రాష్ట్ర మహిళా లోకం సీఎం కేసిఆర్ గారికి రుణపడి ఉంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళలంతా ఈ మూడు రోజులు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతున్నాను ‘ అని అన్నారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…’కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో గత ఏడేళ్లగా ఎన్నో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి సమూల మార్పులు తీసుకొచ్చాం. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సీఎం కేసిఆర్ వేసిన పెద్ద పీట అందరికీ తెలుసు. మహిళలు తమకు మేలు చేసిన వారిని మరిచిపోరు. వారిని అక్కున చేర్చుకుని ఆదరిస్తారు. ఆశీర్వదిస్తారు. కాబట్టి మహిళా దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి. గతంలో మహిళలు తాగు నీటి కోసం కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్ళేవారు. కానీ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్ల ద్వారా మంచినీటిని అందిస్తున్న గొప్పతనం కేసీఆర్ ది మాత్రమే. సీఎం కేసిఆర్ మహిళల భద్రతకు పెద్ద పీట వేశారు. భరోసా కేంద్రాలు, షి- టీమ్స్ వేశారు. వారి భద్రతకు భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ టీమ్స్ ను అమలు చేస్తున్నారు. గతంలో పోలీస్ శాఖలో మహిళలకు రిజర్వేషన్ లేకుండా ఉండేది. కానీ ఇపుడు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న ఘనత సీఎం కేసిఆర్ కు దక్కుతుంది. మహిళలకు సమస్య వస్తే పోలీస్ స్టేషన్ వెళ్ళగానే వారి సమస్య విని సంపూర్ణ భరోసా ఇస్తున్నారు. వడ్డీలేని రుణాల ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక స్వావలంబన చేస్తున్నారు. రాష్ట్రంలో 40,58,000 మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి సంఘం ద్వారా వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10,90,000 మంది అమ్మాయిలు ఉన్నారు. మోడల్ స్కూల్స్ నడపలేము అని కేంద్రం చేతులు ఎత్తివేస్తే 400 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నది. 1000 గురుకులాలు పెడితే అందులో అమ్మాయిలకు ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. 53 డిగ్రీ కాలేజీలు కూడా మహిళకు ఏర్పాటుచేసిన ఘనత సీఎం కేసిఆర్ కే దక్కింది. విద్యా పరంగా అమ్మాయిలకు అవకాశం కల్పించడం ద్వారా భవిష్యత్ కు బాటలు వేశారు. రాజకీయాల్లో రిజర్వేషన్లు ఇవ్వడం తోపాటు నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. పారిశ్రామికంగా మహిళలు ఎదగాలని 4 పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేశారు. ఈ విధంగా అనేక కార్యక్రమాల ద్వారా ప్రతి మహిళా ఏదో ఒక రకంగా లబ్ది పొందుతుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా బంధుగా గుర్తించి పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొనాలి’ అని విజ్ఞప్తి చేశారు.

ఎంపీ కవిత మాట్లాడుతూ… ‘గతంలో మా తండాల్లో మంచి నీటి కోసం కొట్లాటలు ఉండేవి. సీఎం కేసిఆర్ వచ్చాక తాగునీటి కొట్లాటలకు మిషన్ భగీరథ ద్వారా స్వస్తి పలికారు. ఒంటరి మహిళల కన్నీరు తూడ్చి పెన్షన్ ఇస్తున్న నేత సీఎం కేసిఆర్. ఒకరోజు తండాలో ఆడపిల్ల పెళ్లికి దాచుకున్న డబ్బు కాలిపోతే వారి కోసం వచ్చిన పథకం కళ్యాణ లక్ష్మి. దీని కింద నేడు 10 లక్షలకు పైగా మహిళలు లబ్ది పొందారు. ఈరోజు మహిళల కోసం జరుగుతున్న అనేక పథకాలను గుర్తు ఉంచుకుని ఆయన వెంట ఉంటాము అని చెప్పి.. మహిళా దినోత్సవం మూడు రోజుల కార్యక్రమాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *