సకలజనుల సమ్మె కాలాన్ని సాధారణ సెలవులుగా అనుమతించే ఫైలుపై సీఎం కేసీఆర్ ఈరోజు సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన జీవో త్వరలో వెలువడనుంది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వోద్యోగులు 42 రోజులపాటు సమ్మెలో పాల్గొన్నారు. అయితే ఉద్యమకాలంలో 42 రోజులపాటు సకల జనుల సమ్మె చేసిన ప్రభుత్వోద్యోగులకు సమ్మె కాలాన్ని సాధారణ సెలవులుగా మార్చుతామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.