ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి ఆర్థిక సహకారాన్ని అందించి తన పెద్ద మనసును చాటుకున్నారు సీఎం కేసీఆర్. వనపర్తి నియోజకవర్గం రేవల్లికి చెందిన ఓ యువతి పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో ప్రాణాలు నిలిపే అవకాశం ఉన్నాగానీ, చికిత్సకు 30 లక్షల వరకూ ఖర్చు అవుతుండటంతో.. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఆ కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉంది పోయింది. కాగా బాధితురాలికి ఎంబీబీఎస్‌లో సీటు వచ్చినా కూడా.. ఈ వ్యాధి కారణంగా చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. చివరకు ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దృష్టికి రేవల్లి గ్రామస్తులు తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి బాధితురాలి తండ్రిని పిలిపించి మాట్లాడారు. అనంతరం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన పెద్దమనసుతో ఆ యువతి చికిత్స నిమిత్తం 25 లక్షల ఎల్‌వోసీని మంజూరు చేశారు. దీంతో సదరు యువతికి హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు. యువతి కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- HYDRAA’s selective approach: Indiscriminate demolitions for poor, indefinite deadlines for rich
- HYDRAA fear: Registration revenue declines sharply in September and October
- Congress government’s misrule leads to revenue decline
- Real estate and related sectors see a decline of around 50% in Karimnagar
- Cotton procurement: Telangana farmers abandoned by Congress government
- దుబాయిలో రేవంత్ ఏం చేశాడో బయటపెడితే ఇంటికి వెళ్ళలేడు: కౌశిక్ రెడ్డి
- పాలనపై పట్టులేక, ఆఫీసర్లతో రేవంత్ బదిలీల బంతాట!
- ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తా.. ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో: రేవంత్‌కు హరీష్ రావు సవాల్
- రూ. 18,500 కోట్ల విద్యుత్ భారాన్ని ఆపడంలో విజయం సాధించినందుకు నేడు, రేపు బీఆర్ఎస్ సంబరాలు
- మరిన్ని వేధింపులు ఉంటాయి.. ప్రజా పోరాటం నుంచి పక్కకు జరగవద్దు: బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
- హైడ్రా కూల్చివేతలతో ఇల్లు కోల్పోయిన చిన్నారి వేదశ్రీ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
- బుచ్చమ్మది అరాచక హైడ్రా సంస్థతో రేవంత్ రెడ్డి చేయించిన హత్య: కేటీఆర్
- ప్రజా పాలన అని రేవంత్ రెడ్డి రాక్షస పాలన కొనసాగిస్తున్నాడు: హరీష్ రావు
- బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: శ్రీనివాస్ గౌడ్
- సాంప్రదాయాలకు విరుద్ధంగా పీఏసీ చైర్మన్‌ను నియమించారు: వేముల ప్రశాంత్ రెడ్డి