mt_logo

డల్లాస్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

టెక్సాస్ లోని డ‌ల్లాస్‌ నగరంలో తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాలు ఉట్టిప‌డేలా బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. తెలంగాణ పీపుల్స్ అసోసియేష‌న్ ఆఫ్ డ‌ల్లాస్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ వేడుక‌ల్లో తెలంగాణ ఆడ‌ప‌డుచులు పాల్గొని బ‌తుక‌మ్మ ఆడిపాడారు. 14 అడుగుల ఎత్తులో త‌యారు చేసిన బ‌తుక‌మ్మ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఈ సంద‌ర్భంగా జ‌మ్మి పూజ కూడా నిర్వ‌హించారు. గ‌తంలో ప‌ది వేల మందితో ఇదే ఫుట్ బాల్ మైదానంలో బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను నిర్వ‌హించగా, కొవిడ్ కార‌ణంగా ఈ ఏడాది 500 మందితోనే ఘనంగా బతుకమ్మ సంబురాలు జరిపారు. ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఐక్యతకు చిహ్నమైన బతుకమ్మ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *