mt_logo

తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమకు మేలైన భవిష్యత్ వుంది : ఎంపీ రంజిత్ రెడ్డి

“పెరుగుతున్న పశు సంపదకు కావల్సిన దాణా-ప్రస్తుత భవిష్యత్ అవరోధాలు” అనే అంశంపై CLFMA ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న నేషనల్ సింపోజియం శుక్రవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ మంత్రి పురోషోత్తమ్ రూపాల, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ బి.బి పాటిల్ మరియు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించరన్నారు. ముందుగా నీటి వనరుల లభ్యత పెంచి అక్కడ నీలి విప్లవం, గొర్రెల పంపిణీ ద్వారా పింక్ విప్లవాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అంతేకాకుండా పౌల్ట్రీ రంగంపై ఆధార పడిన రైతాంగాన్ని కూడా ఎన్నో విధాలుగా ఆదుకున్నారని తెలియజేశారు. ఇప్పుడిప్పుడే పశుసంవర్ధక శాఖలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మరిన్ని నిధులు ఇచ్చి ఆదుకోవాలని కేంద్రమంత్రిని కోరారు. పశుసంవర్ధక ,మత్స్యశాఖలో తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న పథకాలు,వాటి అమలు తీరును వాటి వల్ల రైతుల ఆర్థికాభివృద్ధిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్న కేంద్రమంత్రి పురుషోత్తమ్ రూపాల.. వాటి వివరాలను గణాంకాలతో సహా ఇంగ్లీష్, హిందీ భాషల్లో చక్కగా వివరించిన ఎంపీ రంజిత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *