కేంద్రం ఈరోజు విడుదల చేసిన స్మార్ట్ సిటీల జాబితాలో తెలంగాణ నుండి హైదరాబాద్, వరంగల్ చోటు దక్కించుకున్నాయి. స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడానికి మొత్తం 98 నగరాలను ఎంపిక చేశారు. రాబోయే ఆరేళ్ళలో స్మార్ట్ సిటీల అభివృద్ధికి రూ. 3 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నారు. ప్రతి ఏడాది ఒక్కో స్మార్ట్ సిటీకి రూ. 100 కోట్ల రూపాయలను కేటాయించనున్నారు. ఇదిలాఉండగా ఏపీ నుండి విశాఖ, తిరుపతి, కాకినాడ నగరాలు స్మార్ట్ సిటీలుగా ఎంపికయ్యాయి.