mt_logo

లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం

పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ  అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకం పాటించడంతో బహుజన ప్రజా విశ్వాసాన్ని చూరగొన్నది.

ప్రజాబలం ఉన్న నేతలను ఎంపికచేయడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకన్నా విజయావకాశాలు మెరుగ్గా సాధించే పరిస్థితి కల్పించారు. లిస్టు ప్రకటనతోనే ఒక విశ్వాసం నెలకొనడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ముందుకు వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో విజయదుందుభి మోగించేందుకు పార్టీ సన్నద్ధమైంది. ఎన్నికల కార్యక్షేత్రంలోకి ఎక్కడికక్కడ అభ్యర్థులు దూసుకుపోనున్నారు.

కాగా ఇప్పటికే ప్రకటించిన కొందరు అభ్యర్థులు వారి వారి పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ఈ సందర్భంగా వారికి ప్రజల్లోంచి అనూహ్యమద్దతు లభిస్తుండడం గమనార్హం. పార్టీ ముఖ్యనేతలు ప్రజాప్రతినిధులు అన్ని పార్లమెంటు స్థానాల పరిధిలో విస్తృత ప్రచారాన్ని చేపట్టి ప్రజల ఆదరణను పొందేందుకు సమాయత్తమైతున్నారు.

కాగా ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు అధినేత కేసీఆర్ త్వరలోనే రంగంలోకి దిగనున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్త పర్యటనలతో అటు పార్టీ శ్రేణుల్లో ఇటు ప్రజల్లో పునరుత్తేజాన్ని నింపి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రజా మద్దతు కూడగట్టనున్నారు.

మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా

1. ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు (ఓసీ)
2. మహబూబాబాద్ (ఎస్టీ) – మాలోత్ కవిత
3. కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ)
4. పెద్దపల్లి (ఎస్సీ) – కొప్పుల ఈశ్వర్
5. మహబూబ్‌నగర్ – మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)
6. చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ)
7. వరంగల్ (ఎస్సీ) – డాక్టర్ కడియం కావ్య
8. నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్ (బీసీ)
9. జహీరాబాద్ – గాలి అనిల్ కుమార్ (బీసీ)
10. ఆదిలాబాద్ (ఎస్టీ) – ఆత్రం సక్కు (ఆదివాసీ)
11. మల్కాజ్‌గిరి – రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ)
12. మెదక్ – వెంకట్రామి రెడ్డి (ఓసీ)
13. నాగర్‌కర్నూల్ (ఎస్సీ)- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
14. సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్ (బీసీ)
15. భువనగిరి – క్యామ మల్లేశ్ (బీసీ)
16. నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి (ఓసీ)
17. హైదరాబాద్ – గడ్డం శ్రీనివాస్ యాదవ్ (బీసీ)