mt_logo

ఎమ్మెల్సీ కవితతో సమావేశమైన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్

బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని కవిత నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గారెత్ విన్ ఓవెన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో పాటు పలు అంశాలపై గారెత్ విన్ ఒవేన్ తో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *