mt_logo

సిద్దిపేటను విద్య, వైద్య క్షేత్రంగా మారుస్తాం : మంత్రి హరీష్ రావు

సిద్దిపేటను విద్య, వైద్య క్షేత్రంగా మారుస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. చిన్నకోడూరు మండలం రామంచ శివారులో హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ వారు నిర్మించనున్న శ్రీ రంగనాయక స్వామి బీ ఫార్మసీ కళాశాల భవన నిర్మాణానికి మంత్రి హరీశ్‌ రావు ఈరోజు శంకుస్థాపన చేశారు. సిద్దిపేటకు బీ ఫార్మసీ కళాశాల రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రూ. 26 కోట్లతో ఈ బీ ఫార్మసీ కళాశాల నిర్మిస్తున్నారని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే బీఫార్మసీ విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాగా సిద్దిపేటలో ఇప్పటికే 1350 మంది ఏంబీబీఏస్ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారని హరీష్ రావు అన్నారు.

ఈ ప్రాంత విద్యార్థులకు అవసరమైన, ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులను ఏర్పాటు చేస్తామని, ఎల్అండ్ టీ సంస్థతో 500 మందికి శిక్షణ, ఉపాధి కల్పిస్తామన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో వేలాది మంది గ్రామీణ విద్యార్థులకు విద్యనందించడం గొప్ప విషయం అని ప్రశంసించారు. కళాశాల భవన నిర్మాణానికి., ఎగ్జిబిషన్ సొసైటీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీనిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *