mt_logo

సంక్షేమ పథకాలను బీజేపీ ప్రభుత్వం ఉచితాలుగా చిత్రికరిస్తోంది : ఎమ్మెల్సీ కవిత

దేశ జ‌నాభాలో అధిక శాతం మంది పేద‌వాళ్లే అని, కేంద్రమైనా లేక రాష్ట్రమైనా.. వారి కోసం సంక్షేమ ప‌థ‌కాల‌ను రూపొందిస్తుంద‌ని, వాటిని ఉచితాలుగా చూడొద్దని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత అన్నారు. పేద‌ల కోసం ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉచితాలుగా చిత్రీక‌రిస్తున్న‌ట్లు క‌విత ఆరోపించారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను ఉచితాలు అన‌డం పేద‌ల్ని అవ‌మానించ‌డ‌మేనని, ఆ ప‌థ‌కాల‌ను ఉచితాలుగా పిలువ‌రాదని బీజేపీని క‌విత కోరారు.పేద‌ల ఆరోగ్యం, వ్య‌వ‌సాయం, పిల్ల‌ల చ‌దువుల కోసం సంక్షేమ ప‌థ‌కాల‌ను అమలు చేస్తున్నామ‌ని, ఇవి ఏవీ కూడా ఉచితం కాదని, ఇటీవ‌ల కార్పొరేట్ బ్యాంకుల‌ను లూటీ చేసిన వారికి 10 ల‌క్ష‌ల కోట్ల రుణాన్ని ఎత్తివేయ‌డం ఉచితం అవుతుంద‌ని అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని, మ‌ద్ద‌తు ఇవ్వ‌కున్నా క‌నీసం స్వేచ్ఛ‌ను ఇవ్వాల‌ని కవిత సూచించారు. ఉచిత స్కీమ్‌ల‌ను ఎత్తివేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై కేంద్ర వ‌త్తిడి తెస్తున్న తీరు స‌రిగా లేద‌ని, వెంటనే ఆ ఆలోచన మానుకోవాలని హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *