mt_logo

ఆదివాసీల జీవన విధానం ప్రపంచానికి ఆదర్శం : మంత్రి కేటీఆర్

ప్ర‌పంచ ఆదివాసీ దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదివాసీ సోద‌రసోద‌రీమ‌ణుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రకృతితో మమేకమై జీవిస్తూ, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ, అవసరమైనపుడు హక్కులకోసం గళమెత్తుతున్న ఆదివాసీల జీవన విధానం మాకందరికీ ఎంతో ఆదర్శం అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ‘మావ నాటే మావ రాజ్‌.. మా తాండాలో మా రాజ్యం’ అనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. గూడెంల‌ను గ్రామ‌పంచాయ‌తీలుగా తీర్చిదిద్ది ఆదివాసీల క‌ళ‌ను సీఎం కేసీఆర్ తీర్చార‌ని పేర్కొన్నారు తెలంగాణ‌లోని ఆదివాసీల ఆత్మ‌గౌర‌వం ప్ర‌తిబింబించేలా బంజారాహిల్స్ రోడ్ నంబ‌ర్ 10లో నిర్మించిన కుమ్రం భీం ఆదివాసీ భ‌వ‌న్‌ను త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌న్నారు. ఆదివాసీ యోధుడు కొమురం భీం స్మరణలో జోడేఘాట్‌లో కుమ్రం భీం మ్యూజియంను ఏర్పాటు చేశామని, ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీం జిల్లా అని నామ‌క‌ర‌ణం చేశామ‌ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *