mt_logo

తెలంగాణతో పనిచేసేందుకు ఎంవోయూ కుదుర్చుకున్న కైలాష్ సత్యార్థి ఎన్జీఓ

పిల్లలు, మహిళల సంరక్షణ కోసం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఎన్జీఓ బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ (బీబీఏ) సంస్థ ఇకపై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర బాలల రక్షణ సంఘం (ఎస్‌సీపీఎస్‌), మహిళ, శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూసీడీ), పోలీసుశాఖకు చెందిన మహిళా భద్రతా విభాగం (డబ్ల్యూఎస్‌డబ్ల్యూ)తో బీబీఏ సంస్థ ఎంవోయూ కుదుర్చుకుంది. బలవంతంగా పని చేస్తున్న, బందీలుగా ఉన్న కార్మికు లు, అక్రమ రవాణాకు గురైన పిల్లలు, మహిళల రక్షణ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం, వారిని రక్షించి తిరి గి సమాజంలో కలిసి పోయేలా చేయడం, పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయనున్నట్టు తెలిపింది. రాష్ట్రంలోని 12,500 గ్రామాలను ‘బాలల స్నేహపూర్వక గ్రామాలు’గా మార్చడమే లక్ష్యంగా మూడేండ్ల కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని వివరించింది. ఈ కార్యక్రమంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్‌, అడిషనల్‌ డీజీపీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి, ఐసీపీఎస్‌ నోడల్‌ అధికారి శారద, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ అధికారి రాకేశ్‌తో బీబీఏ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ధనంజయ్‌ టింగల్‌, సీనియర్‌ అధికారులు ఎం చందన పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *