mt_logo

బుర్జ్ ఖలీఫాపై మన బతుకమ్మ

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే బతుకమ్మ పండుగ ఖ్యాతి ఒక్క తెలంగాణకే పరిమితం కాకుండా, ఖండాంతరాలు దాటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక చిహ్నమని, మన తెలంగాణ సంస్కృతి, ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు నడుంబిగించినట్లు జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఏటా ఏదైనా కొత్త వేడుక నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు, దీనిలో భాగంగా బతుకమ్మ సాంస్కృతి ప్రపంచమంతా తెలిసేలా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను పాటను అక్టోబర్ 23వ తేదీన ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. తాజాగా.. ‘అల్లిపూల బతుకమ్మ’ పాటపై నటులు ప్రియదర్శి, రాహుల్ చేసిన ఇంటర్వ్యూలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మను ప్రపంచవ్యాప్తం చేసేందుకే అల్లిపూల బతుకమ్మ పాటను గౌతమ్ మేనన్, ఏఆర్ రెహ్మాన్ తో రూపొందించినట్లు కవిత చెప్పారు. ఈ పాట చేశాక.. బతుకమ్మ మీద సినిమా చేసేందుకు గౌతమ్ మేనన్ ఆసక్తి చూపించారని, ఇలాంటి కొత్త ప్రయోగాలతోనే బతుకమ్మ ఖ్యాతి పెరుగుతుందని తెలిపారు. ప్రపంచానికి బతుకమ్మ గొప్పదనం తెలిసేలా.. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించడం కోసం రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా కరోనా మహమ్మారి కారణంగా సాధ్యపడలేదని, లక్కీగా ఈ ఏడాది ఆ అవకాశం లభించిందని పేర్కొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *