mt_logo

తెలంగాణలో రూ.600 కోట్లతో అట్టెరో ఇండియా భారీ పెట్టుబడి : మంత్రి కేటీఆర్

పెట్టుబడుల రంగంలో దూసుకుపోతున్న తెలంగాణకు తాజాగా మరో భారీ పెట్టుబడి రానుంది. ప్రముఖ సంస్థ అయిన అట్టెరో ఇండియా కంపెనీ రాష్ట్రంలో సుమారు రూ. 600 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రకటిస్తూ… ఈ పెట్టుబడి ద్వారా 300 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి, అనేకమందికి పరోక్ష ఉపాధి లభించనుందని తెలిపారు. ఇందుకు కంపెనీ యజమాన్యానికి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడు లు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీలకు టీఎస్ ఐపాస్ ద్వారా కేవలం పదిహేను రోజుల్లోనే అన్ని రకాల అనుమతులను జారీ చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ పారదర్శక విధానం ద్వారా వేల కంపెనీలు తెలంగాణకు క్యూ కడుతున్నాయని, కేవలం ఎనిమిది సంవత్సరాల్లో 2.5 లక్షల పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌లో తెలంగాణ మంచి ప్రతిభ కనబరుస్తోందని, ఫలితంగా రాష్ట్రంలో ఒకసారి పెట్టుబడి పెట్టిన కంపెనీలు మళ్ళీ ఇక్కడే మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతున్నారని అన్నారు. అలాంటి పెట్టుబడే 24 శాతంగా నమోదు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయని ఈ  సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

కాగా అట్టెరో కంపెనీ రీసైక్లింగ్, అప్‌సైక్లింగ్, లి-అయాన్ రీసైక్లింగ్, రివర్స్ లాజిస్టిక్స్, కన్సల్టింగ్, కార్బన్ ఫుట్‌ప్రింట్ ఇండస్ట్రీలో గుర్తింపు పొందింది. విలువైన, ఫెర్రస్, ఎర్త్ లోహాలను వెలికితీయడంలో అనుభవం ఉన్న కంపెనీకి నోయిడాలో సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *