తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడాన్ని విమర్శించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్… సోమవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ తన స్వంత పార్లమెంట్ నియోజకవర్గం గెలవలేకపోయిన రాహుల్ గాంధీ… జాతీయ పార్టీ ఆశయాలతో ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌ను విమర్శించే హక్కు రాహుల్‌కు లేదని మంత్రి ఆరోపించారు. ప్రధానమంత్రి కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ.. ముందుగా ప్రజల్ని ఒప్పించి స్వంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవాలని మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. కాగా 2019లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి ఎంపీగా పోటీ చేసి రాహుల్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
