ట్రాఫిక్ సిగ్నల్స్ వెహికిల్స్ రద్దీ లేకపోయినా వాహనదారులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. రియల్ టైం డేటా ఆధారంగా ట్రాఫిక్ సిగ్నల్ కలర్స్‌ను మార్చే కొత్త అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ (ఏటీఎస్‌సీ) వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏటీఎస్‌సీని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్) అభివృద్ధి చేసింది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అడాప్టివ్ కంట్రోల్ అల్గోరిథం ద్వారా పనిచేసే ఈ వ్యవస్థను కాంపోజిట్ సిగ్నల్ కంట్రోల్ స్ట్రాటజీ అని పిలుస్తారు. ఇది రియల్ టైం ఆధారంగా పనిచేస్తుంది. ఇది సాధారణ ట్రాఫిక్ సిగ్నల్‌ల మాదిరిగా కాకుండా, మారుతున్న వాహనాల రాకపోకల ఆధారంగా స్వయంచాలకంగా గ్రీన్ లైట్‌ను నిరంతరంగా సర్దుబాటు చేస్తుంది. దీనివల్ల తక్కువ వాహనాలున్నా ఎక్కువసేపు ఆగే అవసరం ఉండదు. ప్రస్తుతం… ఏటీఎస్‌సీ, పెలికాన్ సిగ్నల్ సిస్టమ్ (పీఎస్ఎస్) ప్రాజెక్ట్‌లో భాగంగా నగరంలో 122 ఏటీఎస్‌సీ సిగ్నల్స్, 94 పెలికాన్ సిగ్నల్స్, 213 హెచ్‌టీఆర్ఐఎంఎస్ సిగ్నల్స్ హైదరాబాద్ అంతటా ఉన్నాయి. 57 ఏటీఎస్‌సీ సిగ్నల్స్, ఇప్పటికే ఉన్న 157 హెచ్‌టీఆర్ఐఎంఎస్ సిగ్నల్‌లతో కూడిన 57 కారిడార్ల ప్రాజెక్ట్ స్కోప్‌లోని ప్రధాన భాగం పూర్తయింది. కొత్త వ్యవస్థలో భాగంగా నగరంలో విస్తృత ప్రయోజనాలను అందజేయాలని జీఎహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. నగరంలోని ప్రధాన కారిడార్లలో ఏటీఎస్‌సీ వ్యవస్థతో ట్రాఫిక్ మెరుగుపడనుంది. పుష్-బటన్ సౌకర్యంతో కూడిన 94 పెలికాన్ సిగ్నల్స్ పాదాచారులు సురక్షితంగా రోడ్‌క్రాస్ చేసేలా సహాయపడుతాయి. ఈ సిగ్నల్స్‌ను ఎక్కువగా దవాఖానలు, కళాశాలలు/పాఠశాలలు, పాదచారులు ఎక్కువగా ఉండే వాణిజ్య బహిరంగ ప్రదేశాల్లో అమర్చారు.