తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పింది. ఆశావర్కర్ల నెలవారీ ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్‌లు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్నవాటితో కలుపుకొని 30 శాతం ఇంటెన్సివ్స్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు ఎన్‌హెచ్‌ఎం కింద పని చేస్తున్న ఆశా కార్యకర్తలందరికి ఈ పెంపు వర్తించనుంది. ప్రభుత్వ విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం నెలవారీ ప్రోత్సాహకాలు 7500 నుంచి 9750కి పెరగనున్నాయి. 2021 జూన్ నుంచి పెంచిన ఇన్సెంటివ్‌లు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. కాగా.. కరోనా మహమ్మారి ఉదృతంగా ప్రబలిన సమయంలోనూ ధైర్యంగా విధులు నిర్వహించిన ఆశాకార్యకర్తలకు సీఎం కేసీఆర్ ఇది వరకే రెండుసార్లు ఇంటెన్సివ్స్ పెంచగా.. తాజాగా ఇది మూడవ ఇంటెన్సివ్. ఇక అడగకముందే తమకు ఇంటెన్సివ్స్ పెంచడం పట్ల ఆనందంలో మునిగి పోయారు ఆశాకార్యకర్తలు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- HYDRAA’s selective approach: Indiscriminate demolitions for poor, indefinite deadlines for rich
- HYDRAA fear: Registration revenue declines sharply in September and October
- Congress government’s misrule leads to revenue decline
- Real estate and related sectors see a decline of around 50% in Karimnagar
- Cotton procurement: Telangana farmers abandoned by Congress government
- దుబాయిలో రేవంత్ ఏం చేశాడో బయటపెడితే ఇంటికి వెళ్ళలేడు: కౌశిక్ రెడ్డి
- పాలనపై పట్టులేక, ఆఫీసర్లతో రేవంత్ బదిలీల బంతాట!
- ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తా.. ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో: రేవంత్‌కు హరీష్ రావు సవాల్
- రూ. 18,500 కోట్ల విద్యుత్ భారాన్ని ఆపడంలో విజయం సాధించినందుకు నేడు, రేపు బీఆర్ఎస్ సంబరాలు
- మరిన్ని వేధింపులు ఉంటాయి.. ప్రజా పోరాటం నుంచి పక్కకు జరగవద్దు: బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
- హైడ్రా కూల్చివేతలతో ఇల్లు కోల్పోయిన చిన్నారి వేదశ్రీ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
- బుచ్చమ్మది అరాచక హైడ్రా సంస్థతో రేవంత్ రెడ్డి చేయించిన హత్య: కేటీఆర్
- ప్రజా పాలన అని రేవంత్ రెడ్డి రాక్షస పాలన కొనసాగిస్తున్నాడు: హరీష్ రావు
- బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: శ్రీనివాస్ గౌడ్
- సాంప్రదాయాలకు విరుద్ధంగా పీఏసీ చైర్మన్‌ను నియమించారు: వేముల ప్రశాంత్ రెడ్డి