mt_logo

నేటి నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

నేటి నుండి అసెంబ్లీ మొదలవనుంది. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలిపి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. కాగా సోమవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి ఉభయ సభల్లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశమవుతుంది. స్పీకర్‌ అధ్యక్షతన అసెంబ్లీలో, సయ్యద్‌ అమినుల్‌ హసన్‌ జాఫ్రీ అధ్యక్షతన మండలిలో బీఏసీ సమావేశం వేర్వేరుగా నిర్వహించనున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చ జరగాలి? అన్నదానిపై బీఏసీలో నిర్ణయం తీసుకొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *