mt_logo

మొదటిరోజు ఘనంగా ‘కేసీఆర్ మహిళాబంధు’ సంబురాలు

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ‘కేసీఆర్‌ మహిళాబంధు’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా, ప్రతీ గ్రామంలో ‘కేసీఆర్ మహిళాబంధు’ సంబురాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు… అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నేతృత్వంలో మొదటి రోజు వేడుకలు అంబరాన్నంటాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఏడున్నరేండ్లుగా మహిళాభ్యున్నతే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. వాటిని లబ్ధిదారులకు వివరిస్తూ ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు వేడుకలు నిర్వహించారు. ఆదివారం మొదటిరోజు సీఎం కేసీఆర్‌ ఫొటోకు రాఖీలు కట్టడం, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు, ఆశ వర్కర్లు ఏఎన్‌ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానాలు చేపట్టారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సంబురాలు జరుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *