mt_logo

ఏప్రిల్ 14న నల్గొండలో టీఆర్ఎస్ బహిరంగసభ

త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ వేగవంతం చేసింది. ఈ నెల 13న కరీంనగర్ లో బహిరంగసభ జరగనుండగా, 14 న నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతోపాటు జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జిలతో శనివారం ఉదయం 10గంటలకు టీఆర్ఎస్ పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని గులాబీ అధినేత కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ చేపట్టబోయే ప్రచార కార్యక్రమాలు, ఏఏ జిల్లాల్లో ఏఏ తేదీల్లో కేసీఆర్ బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించాలనే అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రధాన అంశంగా కేసీఆర్ ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *