గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కు మరో జాతీయ పురస్కారం. చార్మినార్ అభివృద్ధికి, చార్మినార్ పాదాచారుల ప్రాజెక్టు ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు గుర్తింపుగా ప్రత్యేక స్వచ్ఛ ఐకానిక్ ప్లేస్ గా హైదరాబాద్ కు అవార్డు. కేంద్ర ప్రభుత్వ తాగునీరు, శానిటేషన్ మంత్రిత్వ శాఖ ఈ అవార్డును జిహెచ్ఎంసికి ప్రకటించింది. స్వచ్ఛ భారత్ మిషన్ నాలుగవ వార్షికోత్సవమైన అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి రోజున న్యూఢిల్లీలోఈ పురస్కారాన్ని అందుకోవాలని కోరుతూ కమిషనర్ దాన కిషోర్ కు లేఖ రాసిన స్వచ్ఛ భారత్ మిషన్.